న్యూట్రిజీనోమిక్స్ మరియు మీరు

Mar 11, 2019

2363 Views


మీ ఆహారంలో లోపాలు  ఎక్కడ ఉన్నాయి?

పోషక ఆహారం మరియు రోజువారీ వ్యాయామం ఉన్నప్పటికీ వారి ఆరోగ్య లక్ష్యాలను సాధించలేకపోతున్నారని చాలామంది అభిప్రాయపడ్డారు. వార్షిక ఆరోగ్య పరీక్షలు కూడా అధిక ఉపయోగం ఉన్నట్లు అనిపించడం లేదు. లోపాలను గుర్తించడం మరియు తగ్గించడం ఎలా? న్యూట్రిజీనోమిక్స్ శాస్త్రవేత్తలు మన ఆహారం మరియు జీవనశైలి మధ్య పరస్పరాన్ని చూసి అవి మన DNA ను — జీవక్రియ, అభివృద్ధి, మరియు ఆరోగ్య సంబంధిత జన్యువులు — ఎలా ప్రభావితం చేస్తాయో చెప్తారు.
Woman feeding sweet to her son

న్యూట్రిజీనోమిక్స్ ను అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యం?

  • సాధారణ ఆహార పదార్ధాలు మన DNA పై జన్యు వ్యక్తీకరణ లేదా నిర్మాణం మార్చడానికి నేరుగా లేదా పరోక్షంగా పనిచేస్తాయి. ఉదాహరణకు, ఆహార కొవ్వు / కార్బోహైడ్రేట్ స్థాయిలు మన జన్యు కార్యకలాపాలు, జీవక్రియ మార్పులు, లావు మరియు తద్వారా, బరువు పెరుగుట (స్థూలకాయం) పై  ప్రభావితం చేస్తాయి.
  • కొన్నిసార్లు, మనలో కొంతమందికి ఆహారం అనేక వ్యాధులకు తీవ్రమైన ప్రమాద కారకంగా ఉంటుంది. ఉదాహరణకు, MTHFR జన్యు వైవిధ్యాల వాహకులు తక్కువ ఎంజైమ్ కార్యకలాపాలు కలిగి ఉంటారు, అందువల్ల ఫోలేట్ లోపానికి అధిక ప్రమాదం ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో, విటమిన్ B6 యొక్క వినియోగం పెంచుకోవాలి. జన్యు పరీక్ష మంచి ఆరోగ్యాన్ని పొందటానికి, ఆహార మార్పులను అమలు చేయడంలో సహాయపడుతుంది.
  • ఆరోగ్యకరమైన మరియు వ్యాధి స్థితుల మధ్య సంతులనం మీద ఆహారం యొక్క ప్రభావం మన DNA పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, SOD2 జన్యువులోని వైవిధ్యం అనామ్లజని చర్యను మార్చగలదు మరియు అధిక ఆక్సీకరణ ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి వారు అనామ్లజనకాలు అధికంగా ఉన్న ఆహారాన్ని తినాలి.
  • కొన్ని ఆహారనియంత్రిత జన్యువులు (మరియు వాటి వైవిధ్యాలు) దీర్ఘకాలిక వ్యాధుల ఆగమనం, సంభవం, పురోగతి మరియు తీవ్రతను ప్రభావితం చేస్తాయి.
  • పోషక అవసరాలు, పోషక స్థితి, మరియు జన్యురూపం యొక్క జ్ఞానం ఆధారంగా ఆహార జోక్యం ద్వారా దీర్ఘకాల వ్యాధులు నివారించవచ్చు, తగ్గించవచ్చు, లేదా నియంత్రించవచ్చు. ఉదాహరణకు, కొన్ని జన్యు వైవిధ్యాలు గ్లూటెన్ అసహనాన్ని పెంచుతాయి. జన్యు పరీక్ష అటువంటి ప్రమాద కారకాల్ని గుర్తించడానికి సహాయపడుతుంది.

 

మీరు న్యూట్రిజీనోమిక్స్ నుండి ఏమి తెలుసుకోవచ్చు?

  • ఆరోగ్యకరమైన శరీరం మరియు మనసు కోసం అవసరమైన ముఖ్య పోషకాలను గ్రహించే శక్తి
  • వివిధ అవయవాలు మరియు జీవరసాయన మార్గాల్లో పోషకాల ప్రభావం
  • హాని నుండి మీ జన్యువును రక్షించే పోషకాహార అంశాలు
  • మీ జీవనశైలి, ఆహారం, ఫిట్నెస్, అలవాట్లు మొదలైన వాటిపై జన్యువుల ప్రభావం

 

న్యూట్రిజీనోమిక్స్ పరీక్ష పొందడానికి ఉత్తమ సమయం ఎప్పుడు?

ఇప్పుడే. జీవితకాలంలో ఒకసారి ఈ నాన్-ఇన్వేసీవ్  పరీక్షలను తీసుకుంటే సరిపోతుంది. వయస్సుతో సంబంధం లేకుండా, ఎవరైనా ఈ పరీక్షను తీసుకోవచ్చు. ఫిట్నెస్ లో ఆరంభకులు లేదా నిపుణులు ఈ పరీక్ష నుండి లాభపడవచ్చు.
 

జీవిత నాణ్యతను మెరుగుపరచడానికి మీరు న్యూట్రిజీనోమిక్స్ ను ఎలా ఉపయోగించుకోవచ్చు?

మీ ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడంలో, మీ ఆరోగ్య ప్రయాణం ప్రారంభంలో న్యూట్రిజీనోమిక్స్  మీకు సహాయపడుతుంది. ఇది ఎలా పనిచేస్తుంది:

  • జన్యు పరీక్షలు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి — మీరు ఆర్డరు చేయవచ్చు. మీరు నమూనా సేకరణ కిట్ మరియు ఆరోగ్య చరిత్ర ప్రశ్నాపత్రం అందుకుంటారు.
  • మీరు కిట్ ను పంపిన తర్వాత, మీ DNA విశ్లేషించబడుతుంది.
  • మా జన్యు సలహాదారులు మీ కోసం ప్రత్యేకించబడిన పోషణ, ఫిట్నెస్, మరియు వెల్నెస్ సలహా అందించడానికి ఆరోగ్య చరిత్రను జన్యు పరిశోధనలతో అనుసంధానం చేస్తారు.
  • మీకు సరిపడే రోజూవారీ ఆహార మరియు ఫిట్నెస్ ప్రణాళిక రూపొందించడానికి మీ పోషకాహార నిపుణులు మరియు వ్యక్తిగత శిక్షకులు కుడా జన్యు సలహాల సెషన్లో భాగం కావచ్చు.

success

Disclaimer: The information provided here is not exhaustive by any means. Always consult your doctor or other qualified healthcare provider with any questions you may have regarding a medical condition, procedure, or treatment, whether it is a prescription medication, over-the-counter drug, vitamin, supplement, or herbal alternative.